నిర్మల్ పోలీసులు ఛేదించిన సంచలన సుపారీ హత్య కేసు
నిర్మల్ జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ ) నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి కేసును ఛేదించాయి. పోలీసుల దర్యాప్తులో ప్రధాన కుట్రదారుగా అన్వరీ బేగం ఉన్నట్లు తేలింది. వ్యక్తిగత విభేదాలు, అక్రమ సంబంధం బయటపడటం, అస్లాం ఖాన్ వివాహం చేసుకోవాలనే నిర్ణయంపై ఏర్పడిన...