సీతారాంపల్లిలో ఆరోగ్య శిబిరం – క్షయ, బీపీ, షుగర్ పరీక్షలతో ప్రజలకు సేవలు
ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి డీఎంహెచ్వో డా. నరేందర్ రాథోడ్ మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీతారాంపల్లి రైతు వేదికలో శుక్రవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి వైద్య సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫోర్టబుల్ మొబైల్ ఎక్స్రే యంత్రం ద్వారా...