బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యం

డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్‌ఐ ఉషారాణి మంచిర్యాల, జూలై 20, ( ఆంజనేయులు న్యూస్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి హాజరై విద్యార్థులకు భద్రత, చట్టాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ, బాలికల భద్రతే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో లేదా బయట ఎక్కడైనా వేధింపులు, అసభ్య...