Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 10:20 am Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో బూర్ల మహేందర్‌కు ఘన నివాళి

బూర్ల మహేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటిస్తున్న దృశ్యం.

మంచిర్యాల, జూలై 19, ( ఆంజనేయులు న్యూస్ )

ఇటీవల కన్నుమూసిన బూర్ల మహేందర్‌కు నివాళులర్పిస్తూ శనివారం మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రుమాన్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ శిరీష, సీనియర్ అసిస్టెంట్ స్వప్నతో పాటు కార్యాలయ సిబ్బంది, మండలంలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సభలో బూర్ల మహేందర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుదమల్ల కృష్ణ, ఆర్. భాణేష్, సుమతి, శంకర్, మల్లీశ్వరి, స్వప్న, సబియా, తిరుపతి తదితర రేషన్ డీలర్లు పాల్గొని బూర్ల మహేందర్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.