తెరుచుకోని స్కూల్ గేటు.. గేటు దూకి పాఠశాలలోకి వెళ్లిన విద్యార్థులు
8:45 అయినా గేటు తెరవని సిబ్బంది.. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన మంచిర్యాల, జూలై 15, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉదయం నిర్లక్ష్యం వెలుగుచూసింది. పాఠశాల ప్రారంభ సమయం దాటినా ప్రధాన గేటు తెరవకపోవడంతో విద్యార్థులు గేటు ఎక్కి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8:45 గంటలు దాటినా పాఠశాల గేటు తెరుచుకోకపోవడంతో చిన్నారులు గేటుపైకి ఎక్కి ఆవరణలోకి దూకడం స్థానికులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఈ...