ప్రాణాలు కాపాడి.. రూ.1.08 లక్షలు సురక్షితంగా అప్పగించిన జన్నారం పోలీసులు

బాధితుడికి నగదు అందజేస్తున్న జన్నారం ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, పోలీసు సిబ్బంది. మంచిర్యాల, జూలై 14, ( ఆంజనేయులు న్యూస్ ) మూర్ఛతో అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడటమే కాకుండా, అతని వద్ద ఉన్న రూ.1.08 లక్షల నగదును భద్రపరిచి కుటుంబ సభ్యుల సమక్షంలో తిరిగి అప్పగించి జన్నారం పోలీసులు నిజాయితీ, మానవత్వాన్ని చాటుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 12న రాత్రి 10:37 గంటల సమయంలో ఓ వ్యక్తి మూర్ఛ వచ్చి నోటి నుంచి నురుగు...