“ఏసీబీ దాడులు చేస్తాం”.. బెదిరించి ఆర్ఐకి కుచ్చుటోపీ
"నీపై ఏసీబీ కేసులు ఉన్నాయి" అంటూ బెదిరింపు.. భయంతో ఆన్లైన్లో నగదు బదిలీ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సిద్దిపేట జూలై 12, ( ఆంజనేయులు న్యూస్ ) ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అదే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు రెవెన్యూ అధికారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) తలారి ఐలయ్యను ఏసీబీ అధికారులమంటూ...