ఫేక్ డిగ్రీలు.. 3 వేల మంది టీచర్ల తొలగింపు!
బీహార్ జులై 11, ( ఆంజనేయులు న్యూస్ ) బీహార్ లో నకిలీ సర్టిఫికేట్లు, ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విజిలెన్స్ బ్యూరో సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. విజిలెన్స్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం...