కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. డీసీపీ కార్యాలయం ముందు ప్రమాదకర గుంత
వర్షంతో నిండితే కనిపించవు.. ప్రమాదం పొంచి ఉందంటున్న వాహనదారులు మంచిర్యాల జులై 11, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం ఎదుట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన గుంతను కాంట్రాక్టర్లు భద్రతా చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు లేదా ప్రతిబింబించే సూచికలు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో...