Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 9:12 am Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలకు లయన్స్ క్లబ్ చేయూత

సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని లయన్ వి. మధుసూదన్ రెడ్డి వెల్లడి

జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 200 స్టీల్ ప్లేట్ల పంపిణీ

మంచిర్యాల, జులై 09, ( ఆంజనేయులు న్యూస్ )

సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 200 మంది విద్యార్థినీలకు మధ్యాహ్న భోజనానికి అవసరమైన స్టీల్ ప్లేట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ కొత్త జయప్రకాష్, లయన్ దామోదర్ ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బలహీన వర్గాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడంతో పాటు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) మాలతి దేవి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సమాజ సేవలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల ఉపాధ్యక్షుడు లయన్ వేణుగోపాల్, జోన్ చైర్‌పర్సన్ లయన్ దొంతల ముఖేష్, సీనియర్ లయన్ వి. వినయ్ కుమార్, దాతలు లయన్ కొత్త జయప్రకాష్, లయన్ దామోదర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి, పేరెంట్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి అత్తి సరోజ, అధ్యాపక బృందం, విద్యార్థినీలు పాల్గొన్నారు.