Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 9:23 pm Posted by : Anjaneyulu Dega

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలి: ఎస్పీ నితికా పంత్

తప్పుడు ప్రచారాలు, విద్వేషపూరిత పోస్టులపై కఠిన చర్యలు.. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఆసిఫాబాద్, జూలై 9, ( ఆంజనేయులు న్యూస్ )

సోషల్ మీడియా వేదికలను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తులను కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారాలు, సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ చట్టరీత్యా నేరమని గురువారం హెచ్చరించారు. తప్పుడు ప్రచారం, నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానాస్పద పోస్టులు, నకిలీ ఖాతాలు లేదా అభ్యంతరకర కంటెంట్ కనిపించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యతాయుత పౌరులుగా సహకరించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.