అరుదైన ఎంబోలైజేషన్ చికిత్సతో వృద్ధుడికి పునర్జీవం
మెదడు రక్తస్రావానికి శస్త్రచికిత్స లేకుండాన చికిత్స ఆరోగ్యంగా కోలుకున్న 70 ఏళ్ల వృద్ధుడు యశోద ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ మంచిర్యాల, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ ) తీవ్ర మెదడు రక్తస్రావంతో కోమాలోకి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడికి అరుదైన ఆధునిక వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ యశోద ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు. బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మందమర్రి మండలం గద్దెరాగడికి చెందిన...