జాతీయ సదస్సుకు హాజరైన డిపీఆర్ఓ సంపత్ కుమార్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) సన్మానం
ఆసిఫాబాద్, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ ) కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంబంధాల అధికారి (డిపీఆర్ఓ) సంపత్ కుమార్‌ను టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ మారుమూల జిల్లాకు చెందిన అధికారి జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిపీఆర్ఓ సంపత్ కుమార్ ఎల్లప్పుడూ సహకరిస్తూ,...