Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 2:29 pm Posted by : Anjaneyulu Dega

జాతీయ సదస్సుకు హాజరైన డిపీఆర్ఓ సంపత్ కుమార్‌కు టీయూడబ్ల్యూజే (ఐజేయు) సన్మానం

ఆసిఫాబాద్, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ )

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంబంధాల అధికారి (డిపీఆర్ఓ) సంపత్ కుమార్‌ను టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ బుధవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ మారుమూల జిల్లాకు చెందిన అధికారి జాతీయ స్థాయి సదస్సుకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిపీఆర్ఓ సంపత్ కుమార్ ఎల్లప్పుడూ సహకరిస్తూ, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్ గౌడ్, సంఘం నాయకులు గోపి, కృష్ణంరాజు, దేవనూరి రమేష్, సురేష్ చారి, తారు, రాధాకృష్ణ చారి, శ్రీధర్, రాజు, జానకిరామ్, నితీష్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.