బేర సత్యనారాయణ ఇంటిపై దాడి.. తీవ్రంగా ఖండించిన బీజేపీ

కుటుంబానికి భద్రత కల్పించి.. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి: నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ మంచిర్యాల, జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల మండలం మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ నివాసంపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ఇంటిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించి, కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తపరచాలని, వ్యక్తిగత...