లక్షలు దండుకుని నాణ్యత మరిచిన బిల్డర్లు..!
• సంవత్సరం తిరగకముందే ఊడిపోతున్న అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు • మంచిర్యాలలో నిర్మాణ రంగంపై తీవ్ర ఆరోపణలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల రూపాయలు వసూలు చేసి నిర్మించిన భవనాలు సంవత్సరం పూర్తికాకముందే గోడలు చిట్లిపోవడం, ప్లాస్టర్ ఊడిపోవడం, సీలింగ్ నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసి ప్రశాంతంగా జీవించాలని ఆశించిన కుటుంబాలు,...