వేధింపులు సహించవద్దు.. షీ టీమ్స్‌ను ఆశ్రయించండి

బెల్లంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ బాలికలకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళలు, బాలికలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు....