మంచిర్యాలలో ప్రైవేట్ స్కూళ్ల బుక్కుల దందా..?
ఒక్క బుక్ స్టాల్‌కే పరిమితమైన పుస్తకాల విక్రయం గంటల తరబడి క్యూల్లో తల్లిదండ్రులు.. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలంటూ ఆవేదన ఆంజనేయలు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కొనుగోలు కోసం ఒకే బుక్ స్టాల్‌ను సూచిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ "సాయి బుక్ స్టాల్"లో మాత్రమే వివిధ ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో వందలాది మంది తల్లిదండ్రులు...