గ్రీన్ సిటీలో డ్రైనేజీ దుస్థితి..!
• మురుగునీరు రోడ్లపైకి.. దుర్వాసనతో కాలనీవాసుల అవస్థలు • పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. కార్పొరేటర్‌పై ప్రజల ఆగ్రహం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి కాలనీవాసులకు నిత్యనరకంగా మారింది. డ్రైనేజీ పైపుల నుంచి మురుగునీరు లీకై రోడ్లపైకి చేరుతుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని పలు వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగాయని, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే...