జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా. నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకారం
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో నిలపాలి : కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిరంతరం సమీక్షిస్తూ, సూచికల ఆధారంగా మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను ఆరోగ్య రంగంలో రాష్ట్రంలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని...