జిల్లా గవర్నర్ పర్యటనలో సేవా కార్యక్రమాల సందడి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన (District Governor Official Visit) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జి 2025-26 గవర్నర్ సింహరాజు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 9 కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అలాగే మంచిర్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 2026 పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను ఘనంగా సత్కరించారు. వారికి శాలువాలు కప్పి, మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా గవర్నర్ కోదండరాం, సమాజ సేవే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని, విద్యార్థులను ప్రోత్సహించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్లబ్ పూర్వాధ్యక్షులను ఘనంగా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. రీజన్ చైర్‌పర్సన్ కొత్త సురేందర్, జోన్ చైర్‌పర్సన్ ఏ. బాలాజీ, ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ పి. హనుమంతరావు, సీనియర్ సభ్యులు జి. శ్యాంసుందర్ రావు, వి. మధుసూదన్ రెడ్డి, వి. వినయ్ కుమార్, ఎం. రామాంజనేయులు, గుండా శ్రీనివాస్, డేగ బాబు తదితర లయన్స్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “సేవే లక్ష్యంగా.. మహిళలకు ఉపాధి, విద్యార్థులకు ప్రోత్సాహం” – లయన్స్ క్లబ్ మంచిర్యాల మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది.