“ఒకే చదువు.. నాలుగు డ్రెస్‌లు..! తల్లిదండ్రుల జేబులకు చిల్లు”
ప్రైవేట్ స్కూళ్ల డ్రెస్ కోడ్‌లపై పేరెంట్స్ ఆవేదన విద్యాశాఖ జోక్యం కోరుతున్న తల్లిదండ్రులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్య పేరుతో ఇప్పటికే భారీ ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు డ్రెస్ కోడ్‌ల పేరుతో తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారం మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ యూనిఫామ్‌తో సరిపెట్టకుండా హౌస్ డ్రెస్, స్పోర్ట్స్ డ్రెస్, యాక్టివిటీ డ్రెస్, ప్రత్యేక కార్యక్రమాల కోసం వేర్వేరు దుస్తులను తప్పనిసరి చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒకే ఏడాదిలో...