మంచిర్యాల బైపాస్‌లో చెత్త దహనం కలకలం
• మంటల నుంచి వ్యాపిస్తున్న పొగతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు • “ఇది ఏమన్నా డంపింగ్ యార్డా?” అంటూ స్థానికుల ఆగ్రహం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై తెలంగాణ అమరవీరుల స్థూపం సమీపంలో చెత్త దహనం జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు కాలనీల నుంచి సేకరించిన చెత్తను రాళ్లవాగు పరివాహక ప్రాంతంలో పారవేస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, అక్కడ పేరుకుపోయిన చెత్తను ఉదయం, సాయంత్రం వేళల్లో కాల్చడం వల్ల...