మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గుంతతో పొంచి ఉన్న ప్రమాదం

గతంలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. అయినా పట్టించుకోని అధికారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని రద్దీ ప్రాంతమైన ఐబీ చౌరస్తాలో రోడ్డుమధ్య ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ చౌరస్తాలో గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా...