Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:38 am Posted by : Anjaneyulu Dega

ఎద్దుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు

జైపూర్‌లో రెండు వాహనాలు పట్టివేత – 31 ఎద్దులు రక్షణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలో ఎద్దుల అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రెండు వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం: మొదటి ఘటనలో MH40CD1815 నంబర్ గల వాహనాన్ని తనిఖీ చేయగా డ్రైవర్ షేక్ హుస్సేన్ (20), తండ్రి షేక్ ఫరీద్, జైనూర్ నివాసి మరియు క్లీనర్ తయ్యబ్ ఖాన్ (21), తండ్రి మహమ్మద్ ఖాన్, కేరమేరి నివాసి ఉన్నారు. ఈ వాహనంలో సుమారు 12 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇక రెండో ఘటనలో AP36TA0526 నంబర్ గల వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనానికి యజమాని, డ్రైవర్ గుంటి ఐలయ్య (51), తండ్రి హనుమంతు, జులపల్లి నివాసి కాగా, సాయిల కృష్ణతో కలిసి సుమారు 19 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు. ఎద్దుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందారం వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ రవాణాపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు..