Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 6:34 pm Posted by : Anjaneyulu Dega

పేకాట ఆడుతూ పట్టుబడ్డ జైపూర్ ఎంపీడీవో

ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు

అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని” డిమాండ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ జన్నారం మండలంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, సంబంధిత అధికారిపై మరోవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, ఇలాంటి అవినీతి అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై శాఖపరమైన విచారణ జరుగుతుందా? తప్పు నిరూపితమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.