Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 9:06 am Posted by : Anjaneyulu Dega

నూతన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు షీ టీమ్ సభ్యుల అభినందనలు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా షీ టీం సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, మహిళల భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో షీ టీమ్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, నేరాల నివారణలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో మహిళలకు భద్రత కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు హైమ, ఉషారాణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.