మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు చట్టాలపై అవగాహన ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థినులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో వివరించారు. గొప్ప మహిళల చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు...