క్షీరసాగర్ జెడ్పీహెచ్ఎస్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, క్షీరసాగర్లో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు వంటి వివిధ హోదాలను చేపట్టి పాఠశాల పరిపాలనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా శివకుమార్, మండల విద్యాశాఖాధికారిగా సందీప్, ప్రధానోపాధ్యాయుడిగా అనంత్ బాధ్యతలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తరగతులను నిర్వహించారు....