Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 8:20 pm Posted by : Anjaneyulu Dega

సిఎం కప్ స్టేట్ మీట్‌లో మంచిర్యాల కార్మెల్ విద్యార్థుల ఘన విజయం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వరంగల్ వేదికగా ఫిబ్రవరి 19, 23 తేదీలలో జరిగిన సిఎం కప్ అథ్లెటిక్స్ స్టేట్ మీట్‌లో మంచిర్యాల జిల్లా కార్మెల్ కాన్వెంట్ ఉన్నత పాఠశాల (Carmel Convent State School) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్స్ గెలుచుకుని పాఠశాల ప్రతిష్టను మరింత ఎత్తుకు చేర్చారు. జావెలిన్ త్రో విభాగంలో సృష్టి యోగ్యథ బ్రోంజ్ మెడల్ సాధించి ప్రతిభ చాటుకోగా, ట్రైఅథ్లాన్‌లో శ్రీనిధి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. పూర్వ విద్యార్థిని బి. శృతి 100 మీటర్ల పరిగెత్తులో గోల్డ్ మెడల్, 400 మీటర్ల పరిగెత్తులో సిల్వర్ మెడల్ సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల విజయంపై బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ఆర్. సారూప్య, వైస్ ప్రిన్సిపల్ సీమ, ఎస్ఆర్. సోఫి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పాఠశాల మైదానంలో పీటీ అనిల్ పర్యవేక్షణలో క్రమబద్ధమైన సాధన ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. పీటీలు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విజేతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి క్రీడా వేదికపై మంచిర్యాల జిల్లా విద్యార్థులు మెరిసిన ఈ విజయం స్థానికంగా ఆనంద వాతావరణాన్ని నెలకొల్పింది.