Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 10:21 pm Posted by : Anjaneyulu Dega

ఆంజనేయులు న్యూస్ కథనంకు స్పందన

గోదావరి పుష్కర ఘాట్ చెత్త మయం

వార్త ప్రచురణతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్‌లో ఉన్న గోదావరి పుష్కర ఘాట్ వద్ద చెత్తాచెదారం పేరుకుపోయిన అంశంపై ఆంజనేయులు న్యూస్‌లో ప్రచురితమైన వార్తకు మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. మంగళవారం ఉదయం ప్రత్యేక పరిశుభ్రత సిబ్బందిని, అవసరమైన యంత్రాంగాన్ని ఘాట్ ప్రాంతానికి పంపించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. నీటిలో తేలుతున్న ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మరియు ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పూర్తిగా శుభ్రపరిచారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పుష్కర ఘాట్ ప్రాంతంలో నిరంతర పరిశుభ్రత చర్యలు కొనసాగిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఘాట్ ప్రాంతంలో శుభ్రత పనులు వేగంగా ప్రారంభించి, పూర్తిస్థాయిలో చెత్తను తొలగించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.