Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 9:43 pm Posted by : Anjaneyulu Dega

మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి

మరో ముగ్గురు అరెస్ట్ – 14 రోజుల రిమాండ్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇప్పటికే జైలులో

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రామకృష్ణాపూర్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఏ6 మేడిపల్లి సంపత్, ఏ9 బడ్డారు సూరిబాబు, ఏ14 ముస్తఫా ఉన్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇదే కేసులో తాజాగా మరో 10 మందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.