మంచిర్యాలలో 60 డివిజన్లపై ప్రత్యేక దృష్టి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్ల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. “ప్రతి డివిజన్ను మన ఇల్లుగా భావించి పనిచేయాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు...