కాంగ్రెస్ ప్రభుత్వ రజాకర పాలన నశించాలి – బీజేపీ ఆగ్రహ నిరసన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆగ్రహ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన వెంకటరమణారెడ్డి పై అక్కస్సుతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గుండాలను ప్రేరేపించి...