ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం!
5 ఎకరాల భూమికి బదులు 1 ఎకరానికే నష్టపరిహారం? న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితుడు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రైతు మాడుగుల నర్సయ్య జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తన కుటుంబానికి చెందిన ఐదు ఎకరాలకు పైగా భూమి ఉండగా, కేవలం ఒక ఎకరానికే నష్టపరిహారం చెల్లించారని వాపోయారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్...