మంచిర్యాలలో ఉత్సాహభరితంగా కార్యక్రమం – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాజరు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: 44వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమాకుల కిషన్ సోమవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార సభలో కోమాకుల కిషన్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తానని, 44వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతూ, కోమాకుల కిషన్ విజయం సాధించి డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.