Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 10:39 pm Posted by : Anjaneyulu Dega

షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌తో వెకిలి చేష్టలకు చెక్!

ప్రేమికుల దినోత్సవం వేళ ఐదుగురు ఆకతాయిలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబాటు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్క్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో వెకిలి చేష్టలకు పాల్పడుతున్న ఐదుగురు ఆకతాయిలను మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది డెకాయ్ ఆపరేషన్ ద్వారా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో శనివారం ఈ ఆపరేషన్ నిర్వహించగా, నిందితులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసి కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు మంచిర్యాల షీ టీమ్ ఎస్సై ఉషారాణి తెలిపారు. విద్యార్థినులు లేదా మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100, రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 కు కాల్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ డెకాయ్ ఆపరేషన్‌లో ఎస్సైతో పాటు షీ టీమ్ సిబ్బంది శ్రవణ్, సతీష్, జ్యోతి, శ్రీలతలు పాల్గొన్నారు.