పెద్ద స్పీడ్ బ్రేకర్ ప్రాణాంతకం.!
కోర్టు ఎదుట రహదారిలో వరుస ప్రమాదాలు పట్టించుకోని అధికారులు – వాహనదారుల ఆవేదన ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో కోర్టు ముందు ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన భారీ స్పీడ్ బ్రేకర్ వాహనదారులకు శాపంగా మారింది. ఆ స్పీడ్ బ్రేకర్ కారణంగా ఇప్పటికే ఐదుసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రమాణాలకు మించిన ఎత్తుతో నిర్మించిన ఈ స్పీడ్ బ్రేకర్ వలన ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడిపోతుండగా, ఆటోలు, కార్లు ఒక్కసారిగా...