Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 4:21 am Posted by : Anjaneyulu Dega

పెద్ద స్పీడ్ బ్రేకర్ ప్రాణాంతకం.!

కోర్టు ఎదుట రహదారిలో వరుస ప్రమాదాలు

పట్టించుకోని అధికారులు – వాహనదారుల ఆవేదన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో కోర్టు ముందు ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన భారీ స్పీడ్ బ్రేకర్ వాహనదారులకు శాపంగా మారింది. ఆ స్పీడ్ బ్రేకర్ కారణంగా ఇప్పటికే ఐదుసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రమాణాలకు మించిన ఎత్తుతో నిర్మించిన ఈ స్పీడ్ బ్రేకర్ వలన ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడిపోతుండగా, ఆటోలు, కార్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయని వారు చెబుతున్నారు. రాత్రి వేళ సరైన సూచిక బోర్డులు, పెయింటింగ్ లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, ఆర్&బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ ఎత్తును తగ్గించి, రహదారిని సురక్షితంగా మార్చాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.