ఎగ్జిట్ పోల్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా!
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని పేర్కొంది. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను భాజపా కైవసం చేసుకునే అవకాశాలున్నాయని, ఈ రెండు కార్పొరేషన్లలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని...