మంచిర్యాలకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్టా.. లేనట్టా..?
హోటళ్ల పరిస్థితి అధ్వానం.. పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో హోటళ్ల పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. పట్టణంలోని ప్రధాన వీధులు, బస్టాండ్ పరిసరాలు, కాలనీల్లో ఉన్న అనేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఆహార భద్రత నిబంధనలు పూర్తిగా గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారం తయారు చేయడం, మురికి నీరు, పాడైన నూనెలు వినియోగించడం, శుభ్రత లేకపోవడం వంటి అంశాలు బహిరంగంగానే కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం కనీస తనిఖీలు కూడా...