బిఆర్ఎస్ పార్టీలో ఏకగ్రీవం.. కాంగ్రెస్ పార్టీలో చేరిక

రసవత్తరంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్న రాజకీయ పార్టీలు ఆంజనేయులు న్యూస్, వికారాబాద్ జిల్లా: వికారాబాద్ పురపాలికలోని 15వ వార్డు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి. విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి భారాస తరఫున నామినేషన్ వేశారు. మంగళవారం మిగతావారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. ఆ కొద్దిసేపటికే భార్యాభర్తలు ఫోన్ స్విచాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. తర్వాత వారు కాంగ్రెస్ గూటికి చేరినట్లు వచ్చిన సమాచారంతో భారాస శ్రేణులు నివ్వెరపోయాయి. ఇదే పురపాలిక...