Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 2:48 pm Posted by : Anjaneyulu Dega

బిఆర్ఎస్ పార్టీలో ఏకగ్రీవం.. కాంగ్రెస్ పార్టీలో చేరిక

రసవత్తరంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్న రాజకీయ పార్టీలు

ఆంజనేయులు న్యూస్, వికారాబాద్ జిల్లా: వికారాబాద్ పురపాలికలోని 15వ వార్డు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి. విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి భారాస తరఫున నామినేషన్ వేశారు. మంగళవారం మిగతావారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. ఆ కొద్దిసేపటికే భార్యాభర్తలు ఫోన్ స్విచాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. తర్వాత వారు కాంగ్రెస్ గూటికి చేరినట్లు వచ్చిన సమాచారంతో భారాస శ్రేణులు నివ్వెరపోయాయి. ఇదే పురపాలిక 1వ వార్డు నుంచి భారాస అభ్యర్థి నామినేషన్ఉ పసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల అనంత్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ మొత్తం 34 వార్డులున్నాయి..