ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ – జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆంజనేయులు న్యూస్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి. వినోద పై వచ్చిన సమాచారంపై జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరు కావడం, ప్రిన్సిపల్ కార్యాలయ గదికి తాళం వేసి ఉందని, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపినప్పుడు, ప్రిన్సిపాల్ ఈ నెల 29వ తేదీ నుండి తన చట్టబద్ధమైన విధులకు హాజరు...