Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 2:38 pm Posted by : Anjaneyulu Dega

సీనియర్ ఫినియా CMC మృతి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కార్మిల్ కాన్వెంట్ హై స్కూల్ CBSE స్థాపకురాలైన సీనియర్ ఫినియా CMC (82) సోమవారం ఉదయం కేరళలో పరమపదించారు. ఆమె మృతి పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతి చెంది లోతైన దుఃఖాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ ఫినియా CMC 2024లో కార్మిల్ కాన్వెంట్ హై స్కూల్ CBSE పాఠశాలను స్థాపించారు. విద్యారంగ అభివృద్ధి కోసం ఆమె జీవితాంతం చేసిన సేవలు అపారమైనవని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. ఆమె దార్శనికత, అంకితభావం మరియు విలువలతో కూడిన విద్యా దృష్టి ఫలితంగా కార్మిల్ కాన్వెంట్ హై స్కూల్ CBSE బలమైన పునాదిపై నిలిచిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని, ఆమె సేవలు మరియు ఆదర్శాలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని యాజమాన్యం అభిప్రాయపడింది.. సీనియర్ ఫినియా CMC అంత్యక్రియలు 2026 జనవరి 31న కేరళలో నిర్వహించనున్నట్లు కార్మిల్ కాన్వెంట్ హై స్కూల్ CBSE పాఠశాల యజమాన్యం తెలిపారు..