Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 10:10 pm Posted by : anjudega

టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నల్గొండలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు. రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని మంత్రి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లో చదివించి మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి సూచించారు.