Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 10:49 pm Posted by : Anjaneyulu Dega

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యం: మాజీ మంత్రి గుంగుల

ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: భాజపా, కాంగ్రెస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరానికి చేసిన అభివృద్ధి శూన్యమని మాజీమంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ.. తామే ఆ నిధులను తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఫొటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధ్వంసం ఏంటో ప్రజలు గమనిచాలని ఆయన కోరారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి లత – ఐలెందేర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మర్రి భావన- సతీష్, నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.