తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గర్వకారణమైన స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని “శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్ మరియు గురువు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత, నాట్య విభూషణి, అన్నం కల్పన ఎం.ఎ, కూచిపూడి” వారి శిష్య బృందంతో నాట్యకళ అయిన కూచిపూడి ద్వారా దేశభక్తి స్ఫూర్తిని ప్రతిఫలింపజేసే నాట్యప్రదర్శనను చేశారు.. ఈ ప్రదర్శనలో భాగంగా కూచిపూడి కళాకారులు భారత స్వాతంత్ర సంగ్రామాన్ని, మన దేశమాతకు అంకితభావాన్ని, మరియు మన సంస్కృతి గొప్పతనాన్ని నాట్యరూపంలో ఆవిష్కరించారు.. ఈ కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్ కుమార దీపక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, డిసిపి భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, నాట్య గురువు కల్పన కు జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు..

ఈ సందర్భంగా నాట్య గురువు కల్పన మాట్లాడుతూ.. సంప్రదాయ సంగీతం, రాగాలు, నాట్యాభినయంతో కూడిన ఈ ప్రదర్శన, మన దేశ గొప్పతనాన్ని తెలియజేసే కళాత్మక ఆవిష్కరణగా నిలుస్తుందని, మన భారతదేశ సౌందర్యాన్ని, యోధుల త్యాగాన్ని, మరియు ప్రజల ఐక్యతను కూచిపూడి రూపంలో ప్రదర్శన చేయడం ఇది ఒక అవిస్మరణీయ అనుభూతినిస్తుందని తెలిపారు..