Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 6:55 pm Posted by : Anjaneyulu Dega

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ 

 ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: వాహనదారులకు దృష్టి లోపం ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ. . ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే డయల్ 100కి సమాచారం అందించాలని డ్రైవర్లకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు నాగరాజు, సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.