Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 10:02 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాలలో ఆధ్వానంగా హోటల్ ల నిర్వహణ..!

పరిశుభ్రతకు దూరంగా.. నిబంధనలకు విరుద్ధంగా 

జాడ లేని ఫుడ్ సేఫ్టీ అధికారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్రంలో విచ్చలవిడిగా తినుబండారాలు పరిశుభ్రతకు, నిబంధనలకు దూరంగా హోటల్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ మధ్య కాలంలో భోజన ప్రియులు రకరకాల తినుబండారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపడంతో హోటళ్లలో ఎక్కడ చూసిన తినుబండారాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా మురికి కాలువల పక్కన సందులలో, చెత్తాచెదారం ఉన్నచోట మూడు పూలు ఆరు కాయల వలె విరజల్లుతున్నాయి. కుళ్ళిన ఆహార పదార్థాలు, పురుగులతో కూడిన తినుబండారాలు అమ్ముతున్నప్పటికీ అనేక మార్లు వీడియోలు వైరల్ అయితున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడలేదని పలువురు వినియోగదారులు బెంబలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటే మారుమూల ప్రాంతాలలో ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హెల్త్ ఆఫీసర్లు కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ ఇంతవరకు ఎక్కడ తనిఖీ నిర్వహించినట్టు దాఖలాలు లేవని పలువురు విమర్శిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు మాత్రం నాణ్యత లోపించినటువంటి ఆహార పదార్థాలు వడ్డిస్తూ ఘుమఘుమలురించే వంటలని, మసాలాలు దట్టంగా వేస్తూ డబ్బులు దండుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా జరిగిన సర్వేలో తెలంగాణ ప్రాంతంలో హోటల్ నిర్వాహకులు శుద్ధమైన నీటిని ఉపయోగించకపోవడంతో నిత్యం హోటల్లో భోజనం చేసేవారికి ప్రేగు, కిడ్నీ, సంబంధిత వ్యాధులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో కోన్ని హోటళ్ల నిర్వహణ ఆద్వానంగా మారింది. మరికొన్ని హోటళ్లలో మాత్రం మరుగుదొడ్లు, మూత్రశాలల, సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ 2006 చట్టం ప్రకారం పాటించని నియమ నిబంధనలు హోటల్ యాజమాన్యాలపై, శుభ్రత లోపించినటువంటి హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.